Turn off light Favorite Comments Report
  • Server Telugu Dubbed

Watch Black Adam 2022 Full Movie in Telugu Dubbed Online Stream Free on LordHD

సినిమా రివ్యూ : బ్లాక్ ఆడమ్ (Telugu Dubbed)
రేటింగ్ : 2.75/5
నటీనటులు : డ్వేన్ జాన్సన్, సారా షాహి, పియర్స్ బ్రాస్నన్ తదితరులు
సినిమాటోగ్రఫీ : లారెన్స్ షేర్
సంగీతం: లార్న్ బాల్ఫీ
నిర్మాతలు : డీసీ ఫిల్మ్స్
దర్శకత్వం : జావుమే కొల్లెట్-సెర్రా
విడుదల తేదీ: అక్టోబర్ 20, 2022

డీసీ ఎక్స్‌టెండెడ్ యూనివర్స్‌లో లేటెస్ట్ సినిమా బ్లాక్ ఆడమ్ గురువారం థియేటర్లలో విడుదల అయింది. ఈ ఫ్రాంచైజీలోనే ఎక్కువ హైప్ ఉన్న సినిమాల్లో ఒకటిగా ఇది రిలీజ్ అవుతుంది. సినిమాల్లో డీసీ భవిష్యత్తును నిర్ణయించే ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏకంగా 200 మిలియన్ డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1,620 కోట్లు పైనే) బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందించారు. మోస్ట్ వయొలెంట్ సూపర్ హీరో సినిమాగా దీన్ని రూపొందించినట్లు ట్రైలర్లు, టీజర్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ సినిమా డీసీకి కొత్త ఊపిరులు పోసిందా? హిట్ కొట్టి తీరాలన్న ఫ్యాన్స్ కోరికను బ్లాక్ ఆడమ్ తీర్చిందా?

కథ: ఐదు వేల సంవత్సరాల క్రితం భూమి మీద కాందాక్ అనే నగరం అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతతో ఉండేది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన రాజు ఆన్హ్ కోట్ (మర్వాన్ కెన్‌జారీ) ఎటర్నియం అనే లోహం కోసం ప్రజలను బానిసలుగా చేసి తవ్విస్తుంటాడు. ఆ లోహంతో చేసిన కిరీటం ధరిస్తే శక్తులు వచ్చి ప్రపంచాన్ని ఏలవచ్చనేది తన కోరిక. కానీ కొందరు ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. వారిని రాజు క్రూరంగా చంపేస్తాడు. అయితే వారిలో ఒకడైన టెత్ ఆడమ్‌కు (డ్వేన్ జాన్సన్) షాజామ్ శక్తులు వస్తాయి. తనకు, రాజుకు జరిగిన యుద్ధంలో రాజు చనిపోతాడు. కోట నాశనం అవుతుంది. ఐదు వేల సంవత్సరాల తర్వాత ఆ కిరీటం కోసం కొందరు తిరిగి వెతకడం ప్రారంభిస్తారు. అలాగే టెత్ ఆడమ్ కూడా తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? టెత్ ఆడమ్, బ్లాక్ ఆడంగా ఎలా మారాడు? జస్టిస్ సొసైటీ ఎవరు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ: మార్వెల్, డీసీ వంటి కామిక్ బుక్స్ ఆధారంగా వచ్చే సూపర్ హీరో సినిమాల్లో కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఉండే కథలు, పాత్రలు ఆల్రెడీ సూపర్ హిట్. వాటిని మనం ఎంత ప్రభావవంతంగా చూపించామనే దానిపైనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో జావుమే కొల్లెట్-సెర్రా సక్సెస్ అయ్యారు. సినిమాను యాక్షన్, మ్యూజిక్ నిలబెట్టేశాయి. ప్రారంభంలో కాందాక్ నగరం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మనకు కేజీయఫ్‌ను గుర్తు చేస్తాయి.